Anantapur: సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై కేసు నమోదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-17 14:44:03  IST  )

అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేశారు...

Anantapur: సెంట్రల్ యూనివర్సిటీ ఘటనపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్‌లోకి ఆగంతకుడు వచ్చాడని విద్యార్థినులు ఆందోళకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేశారు. లేడీస్ హాస్టల్‌లోకి ఆగంతకుడు చొరబడ్డాడని హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 329(4), 79 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే వర్సిటీలో కలెక్టర్, ఎస్పీ విచారణ చేపట్టారు. వైస్ చాన్సలర్‌తో పాటు వర్సిటీ సిబ్బంది, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కార్యాలయానికి రిపోర్టు పంపిస్తామని తెలిపారు. విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది, పోలీస్, రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కాగా ఆదివారం మధ్యాహ్నం వర్సిటీ హాస్టల్ బాత్ రూమ్‌లోకి బీహార్ యువకులు తొంగి చూశారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బాత్ రూమ్‌లో ఉన్న తమకు ఓ వ్యక్తి నీడ కనిపించిందంటూ నిరసన వ్యక్తం చేశారు.వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా కలెక్టర్, డీఎస్పీ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో విచారణ చేపట్టారు.

Next Story