బుగ్గ మఠం భూముల వ్యవహారం.. ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

by Kema Shiva Kumar |

అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి తమపై అటవీ శాఖ అధికారులు నమోదు చేసిన క్రిమినల్ కేసుల విచారణను నిలిపివేయాలని ఇటీవలే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddi Reddy Ramachandra Reddy) హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేశారు.

బుగ్గ మఠం భూముల వ్యవహారం.. ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: బుగ్గ మఠం అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి తమపై అటవీ శాఖ అధికారులు నమోదు చేసిన క్రిమినల్ కేసుల విచారణను నిలిపివేయాలని ఇటీవలే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddi Reddy Ramachandra Reddy) హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. అదేవిధంగా క్రిమినల్ కేసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ జస్టిస్ చల్లా గుణరంజన్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పటిషనర్ తరఫున ముకుల్ రోహత్గి (Mukul Rohatgi) తన వాదనలు వినిపించగా.. ఇరు పక్షా వాదనలు విన్న కోర్టు పెద్దిరెడ్డి రామచంద్రా‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్‌పై వారం రోజుల్లోగా పిటిషనర్ రిజైన్డర్ దాఖలు చేయాలని ధర్మాసనం సమయం ఇచ్చింది. అప్పటి వరకు వివాదాస్పద భూములపై యథా స్థితిని కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Next Story