- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Buddha Venkanna: నన్ను చంపాలని ప్లాన్ చేశారు.. బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు
తనను చంపేందుకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) కట్టుదిట్టంగా ప్లాన్ చేశాడని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తనను చంపేందుకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) కట్టుదిట్టంగా ప్లాన్ చేశాడని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న (Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మంగళగిరి (Mangalagiri)లోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్రలో అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా కొడాలి నాని (Kodali Nani)పై విమర్శలు చేశానంటూ తనను చంపే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. తన హతమార్చేందుకు కుట్రలు చేసి వంశీ ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ (YCP) రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుందని ఫైర్ అయ్యారు. ఆ పార్టీలో మొత్తం నేరస్తులే ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆ అరాచక పాలన చూడలేకనే ప్రజలకు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మరో 30 ఏళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉంటాననే భ్రమలో ఉన్న జగన్ (Jagan)ను ఆయన సతీమణి భారతి (Bharati) మానసిక వైద్యులకు సూచించాలని సెటైర్లు వేశారు. జగన్ మాట్లాడిన మాటలు చేసి సొంత పార్టీ నాయకులే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఏనాడు కార్యకర్తలను పట్టించుకోని జగన్.. నేడు వాళ్లపై వల్లమాలిన ప్రేమను చూపిస్తున్నారని కామెంట్ చేశారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్ప ఎవరూ సంతోషంగా లేరని ఆరోపించారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సెంటు భూమి అయినా.. కబ్జాకు గురైందా అని ప్రశ్నించారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న జగన్ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు.






