- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సన్మానించిన బుద్దా వెంకన్న
పద్మశ్రీ అవార్డు గ్రహీతల మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్‌ను బుద్దా వెంకన్న సన్మానించారు..

దిశ, వెబ్ డెస్క్: నటులు మురళీమోహన్(Murali Mmohan), రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad)కు పద్మశ్రీ అవార్డులు(Padma Shri Awards) వరించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరినీ తెలుగు రాజకీయ, సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో పాటు మరికొందరు నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్‌ను కలిశారు. శాలువాలు కప్పి సత్కరించారు. తాజాగా తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సైతం వీరిద్దరిని అభినందించారు. హైదరాబాద్‌లోని వారి వారి నివాసాల్లో ఆయన కలిశారు. శాలువ, పూలమాలలతో సన్మానించారు. పద్మశ్రీ అవార్డులు అందుకోబోతున్నందుకు రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్‌కు బుద్దా వెంకన్న శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు తమ నివాసాల వద్ద బుద్దా వెంకన్నను సాదరంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేసి మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ సందడి చేశారు.






