బుడమేరు వాగు ఉధృతి.. గుణదల వంతెనపై భారీగా వరద ప్రవాహం

by Vemula.Srinu Prasad |

విజయవాడలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది..

బుడమేరు వాగు ఉధృతి.. గుణదల వంతెనపై భారీగా వరద ప్రవాహం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత ఏడాది విజయవాడ నగరంపై ఈ వాగు విరుచుపడిన విషయం తెలిసిందే. తాజాగా కురిసిన వర్షాలతో బుడమేరు వాగులో వరద ప్రవాహం భారీగా ప్రవహిస్తోంది. దీంతో గుణదల వద్ద వంతెనపై నీరు ప్రవహిస్తోంది. దీంతో బుడమేరు వాగు మరోసారి కూడా బీభత్సం సృష్టిస్తోందేమోనని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు ఇబ్రహీంపట్నంలోని చినలంక, పెదలంక ప్రాంతాల్లో బిగ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువకు గండి పడింది. దీంతో నాగన్నపల్లి, వడ్డపల్లి ఇళ్లలోకి నీరు చేరింది. రాజు పాలెం మండలం అనుపాలం వద్ద వాగు ఉధృతి భారీగా పెరిగింది.

Next Story