- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో మరో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు(TDP Leaders Murdered) గురయ్యారు. పల్నాడు జిల్లా(Palnadu District) వెల్దుర్తి మండలం బోదలవీడులో ఈ ఘటన చోటు చేసుకుంది. గుండ్లపాడు(Gundlapadu)కు చెందిన టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు బైక్ మీద వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన స్కార్పియోతో ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన వారు ఇరువురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే గత కొంతకాలంగా గ్రామంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని సమాచారం.
గతంలో వైసీపీలో ఉన్న వెంకట్రామయ్య టీడీపీలోకి రావడంతో ఈ వర్గ పోరు మొదలైందని.. అది కాస్త తరుచూ తీవ్ర అంతర్గత గొడవలకు దారి తీసిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంకట్రామయ్య వర్గీయులు ఈ హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ హత్య కోసం ఉపయోగించిన వాహనం వెంకట్రామయ్యదే కావడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.






