- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత గొడవలతో ఇద్దరి దారుణ హత్య
కర్నూలు జిల్లాలో పాత కక్షలు మరోసారి హింసకు దారి తీశాయి.

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలో పాత కక్షలు మరోసారి హింసకు దారి తీశాయి. తమ వర్గానికి చెందిన వ్యక్తిని గతంలో హత్య చేశారనే కోపంతో ప్రత్యర్థి వర్గంపై దాడి జరిగింది. ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో జరిగిన ఈ ఘటనలో వెంకటేశ్, పరమేశ్ అనే ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యకు గురయ్యారు. అదే దాడిలో గోవింద్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసు నుంచి ఇరు వర్గాల మధ్య వైరం కొనసాగుతోంది.
గతంలో ఊరు వదిలి వెళ్లిన వైరి వర్గం వారు ఇటీవల తిరిగి రావడంతో ఘర్షణ ముదిరింది. ముందుగానే ఎదురుచూస్తున్న ప్రత్యర్థులు పొలంలో పరమేశ్‌ను హత్య చేయగా, వెంకటేశ్‌ను గ్రామంలో చంపేశారు. పొలం నుంచి వస్తున్న గోవింద్‌పై వేటకోడవళ్లతో దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ భార్గవి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.






