విజయవాడలో దారుణం: న్యూ రాజరాజేశ్వరిపేటలో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య

by Ramesh Naini |

విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో దారుణ హత్య చోటు చేసుకుంది.

విజయవాడలో దారుణం: న్యూ రాజరాజేశ్వరిపేటలో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో దారుణ హత్య చోటు చేసుకుంది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు నాపరాయి, బీరు సీసాలతో కొట్టి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాణిగారితోటకు చెందిన మీసాల కుమార్‌ అలియాస్ కృపారావు (30) వృత్తిరీత్యా పెయింటర్‌. ఇతనికి ఐదేళ్ల క్రితం మౌనికతో వివాహమైంది.

అర్ధరాత్రి న్యూ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్‌ అపార్టుమెంట్స్‌ వద్ద కుమార్‌పై దాడి జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కుమార్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాత గొడవలే ఈ దారుణ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story