ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గ్రాండ్ ఓపెనింగ్

by Disha Web Desk 4 |
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ గ్రాండ్ ఓపెనింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ గుంటూరులోని ఆటోనగర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని భారత రాష్ట్ర సమితి స్టేట్ చీఫ్ తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మతతత్వ బీజేపీని దేశం నుంచి తరమికొట్టాలంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. ఏపీలో ఉన్న వనరులు తెలంగాణలో లేకున్నా అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. తెలంగాణ మోడల్ లాగానే అన్ని రాష్ట్రాలను అభివృద్ధిలో నడిపించాలని కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారన్నారు. ఏపీలో ఆర్భాటాలు ఎక్కువని ఆచరణ శూన్యం అన్నారు. అందుకే ఇప్పటి వరకు కనీసం రాజధాని నిర్మించుకోలేపోయమన్నారు.



Next Story

Most Viewed