- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం.. ఈనెల 21న ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా టిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా టిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు. గుంటూరు రోడ్ నెంబర్ వన్, మంగళగిరి రోడ్డు, ఏ ఎస్ ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు. పార్టీ కార్యకర్తలు నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని గురువారం ఒక ప్రకటనలో తోట కోరారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని... ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తాను ఏపీలో చాటుతామని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఏపీ ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
Also Read..






