ఏపీలో దారుణం.. అన్నగుండెల్లో బాణం దింపిన తమ్ముడు

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం మండలం చెరువూరు గ్రామంలో అన్నపై తమ్ముడు బాణంతో దాడి చేశాడు.

ఏపీలో దారుణం.. అన్నగుండెల్లో బాణం దింపిన తమ్ముడు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం మండలం చెరువూరు గ్రామంలో అన్నపై తమ్ముడు బాణంతో దాడి చేశాడు. చెరువూరు గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి అనే వ్యక్తిపై అతని సొంత తమ్ముడే బాణం గురిపెట్టాడు. జంతువులను వేటాడటానికి ఉపయోగించే బాణంతో దాడి చేయగా అది నేరుగా లచ్చిరెడ్డి గుండెలో ఛాతీలో దిగింది. వెంటనే స్థానికులు లచ్చిరెడ్డిని 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాణాన్ని చాతీ నుండి తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. దాడి చేసిన అనంతరం లచ్చిరెడ్డి తమ్ముడు అక్కడ నుండి పరార్ అయినట్టు స్థానికులు చెబుతున్నారు. అతడి మానసిక స్థితి సరగ్గాలేదని అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Next Story