- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అద్దెకు పెళ్లికూతురు... బెజవాడలో భారీ మోసం.. పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ
కర్ణాటకలోని గంగావతికి చెందిన ఓ తెలుగు కుటుంబానికి సంబంధించిన 34 ఏళ్ల యువకుడికి ఇప్పటివరకూ పెళ్లి కాలేదు. వివాహ సంబంధాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని మధ్యవర్తుల సాయం తీసుకున్నారు. శ్రీదేవి అనే మధ్యవర్తి ద్వారా విజయవాడకు చెందిన తాయారు అనే బ్రోకర్‌ను సంప్రదించారు.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని గంగావతికి చెందిన ఓ తెలుగు కుటుంబానికి సంబంధించిన 34 ఏళ్ల యువకుడికి ఇప్పటివరకూ పెళ్లి కాలేదు. వివాహ సంబంధాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని మధ్యవర్తుల సాయం తీసుకున్నారు. శ్రీదేవి అనే మధ్యవర్తి ద్వారా విజయవాడకు చెందిన తాయారు అనే బ్రోకర్‌ను సంప్రదించారు. తాయారు, పార్వతి, విమల, అప్పారావు అనే ఆటో డ్రైవర్‌తో కలిసి కృష్ణలంకకు చెందిన ఓ యువతిని పెళ్లి సంబంధం కోసం చూపించారు. గత నెల 13న విజయవాడలో పెళ్లి చూపులు జరిగాయి. యువతి కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉందని చెప్పి, వరుడి కుటుంబం నుంచి రూ.3.5 లక్షలు ముందుగా వసూలు చేశారు.
ఈ నెల 5న విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో ఆ యువతి, పల్లవితో యువకుడి వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగింది. మధ్యవర్తులు కర్ణాటకలో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకుండా, విజయవాడలోనే దుర్గ గుడి (Vijayawada Durga Temple)లో వివాహం నిర్వహించారు. 7న గంగావతిలో నవదంపతుల కోసం ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే.. పల్లవితో వచ్చిన ఆమె సోదరుడు హరీష్.. తల్లి అనారోగ్యంతో ఉందని చెప్పి రూ.50 వేలు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు.
వివాహం తర్వాత పల్లవి భర్తతో కలిసి జీవించడానికి నిరాకరించడంతో వరుడి కుటుంబానికి అనుమానం కలిగింది. ఆమెను ప్రశ్నించగా, తనకు ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన భర్త తనను వదిలేశాడని, మధ్యవర్తులు ఐదు రోజుల పాటు పెళ్లి కూతురుగా నటిస్తే రూ.50 వేలు ఇస్తామని ఆశ చూపారని, కానీ తనకు రూ.35 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన సొమ్మును బ్రోకర్లు దోచుకున్నారని వెల్లడించింది. తన అసలు పేరు పల్లవి కాదని, ఆమని అని కూడా చెప్పింది.
మోసపోయినట్లు గ్రహించిన వరుడి కుటుంబం విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ (Krishna Lanka Police Station)లో ఫిర్యాదు చేసింది. తాయారు, పార్వతి, విమల, అప్పారావులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనలో బాధిత యువకుడి కుటుంబం ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ఒత్తిడికి గురైంది.






