BREAKING: ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న తాజా సర్వే.. అధికారం ఆ పార్టీదేనని వెల్లడి

by Shiva |   ( Updated:2024-02-29 14:31:17.0  )
BREAKING: ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న తాజా సర్వే.. అధికారం ఆ పార్టీదేనని వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇప్పటికే వైసీపీ మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల కదనరంగంలోకి దూకారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ఈ క్రమంలో ‘వై నాట్ 175’ నినాదంతో సీఎం జగన్ వరుసగా ‘సిద్ధం’ అనే నినాదంతో బహిరంగ సభలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త వారికి టికెట్లను కేటాయిస్తూ ముందుకెళ్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయం ప్రత్యర్థులకు అంతు చిక్కకుండా వ్యూహాత్మకంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇండియా టీవీ, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్ సంస్థలన్నీ వైసీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని వెల్లడించాయి.

ఏపీ ప్రజలు మరోసారి వైసీపీకే పట్టం కట్టబోతున్నారని సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడించాయి. జీ న్యూస్ - మ్యాట్రిజ్ తాజాగా తన ఒపీనియన్ పోల్‌ను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గాల్లో నిర్వహించింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుందని, మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా అందులో 19 చోట్ల అధికార వైసీపీ అభ్యర్థులు గెలుపొందనున్నట్లు తెలిపారు. తెలుగుదేశం- జనసేన కూటమి 6 సీట్లకే స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొన్నారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే నిర్వహించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 133 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని తెలిపింది. వైసీపీకి 48 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని, టీడీపీ-జనసేనకు 44శాతం లోపే ఓట్లు పోలవుతాయని సర్వే సారాంశం.

Read More..

‘వైసీపీని అధఃపాతాళానికి తొక్కమనండి చూద్దాం’

Advertisement

Next Story