BREAKING: ఎన్నికల వేళ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఇచ్చిన ఈసీ.. ఇద్దరు ఐపీఎస్‌లపై బదిలీ వేటు

by Kema Shiva Kumar |   (  Updated:2024-04-23 16:07:53  IST  )

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

BREAKING: ఎన్నికల వేళ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఇచ్చిన ఈసీ.. ఇద్దరు ఐపీఎస్‌లపై బదిలీ వేటు
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ పీఎస్ఆర్ ఆంజనేయులుపై బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి ఆంజనేయులును బదిలీ చేయాలని ఆదేశాలు సైతం జారీ చేసింది. అదేవిధంగా విజయవాడ నగర సీపీ కాంతిరాణాపై కూడా బదిలీ వేటు పడింది. ఎన్నికలతో సంబంధం లేని విధులను ఆయనకు అప్పగించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ముఖ్యంగా సీఎం జగన్‌పై ఆగంతకుడు రాయితో దాడి చేయడాన్ని ఈసీ చాలా సీరియస్‌గా తీసుకుంది. జరిగిన ఘటనపై వెంటనే విజయవాడ సీపీ ఎన్నికల అధికారికి ఇవ్వాల్సి వచ్చింది. ఇద్దరు ఐపీఎస్‌లను ఈసీ అకస్మాత్తుగా బదిలీ చేయడం ప్రస్తుతం పోలీసు శాఖలో సంచలనంగా మారింది.

Read More...

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బయటపడ్డ భారీ కుంభకోణం!

Next Story