- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
BREAKING: పిఠాపురంలో టెన్షన్.. టెన్షన్.. వైసీపీ అభ్యర్థి వంగా గీతకు తీవ్ర అస్వస్థత
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులంతా తమ నియోజకవర్గాల్లో వాడవాడలో ప్రతి గల్లీ తిరుగుతూ.. తమకే ఓటేయంటూ కాలికి బట్ట కట్టుకోకుండా తిరుగుతున్నారు. వేసవి ఆరంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో ఒంట్లో సత్తువ లేక కొందరు అభ్యర్థులు నీరుగారిపోతున్నారు. తాజాగా ఇవాళ పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎఫ్.కె.పాలెంలో ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో ఆమె అనుచరులు, సన్నిహితులు ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి ఆమెను తన పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లి వైద్యులతో గీతకు చికిత్స అందిస్తున్నారు. మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో వంగా గీత బాధపడుతున్నట్లు తెలుస్తోంది. డీహైడ్రేషన్, బీపీ, షుగర్ లెవల్స్ పెరిగాయని డాక్టర్లు తెలిపారు. ఇప్పటికి ప్రచారాన్ని నిలిపి వేయాలని, ఆమెకు విశ్రాంతి అవసరమని అన్నారు.