- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: టీడీపీ పార్లమెంట్ అభ్యర్థులు ఖరారు..!
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీల అధినేతలు ఫోకస్ పెట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీల అధినేతలు ఫోకస్ పెట్టారు. ఈ విషయంలో అధికార వైసీపీ ఇప్పటికే మెజారీటీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ఎన్నికల ప్రచారంలోకి అభ్యర్థులు దిగబోతున్నారు. మరో వైపు టీడీపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పది ఎంపీ స్థానాలకు గాను అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అందులో శ్రీకాకుళం నుంచి మరోసారి రామ్మోహన్‌నాయుడు బరిలోకి దిగబోతున్నారు.
అనకాపల్లి నుంచి బైరా దిలీప్ చక్రవర్తి పోటీలో ఉండబోతున్నారు. అదేవిధంగా ఇక విశాఖ నుంచి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అల్లుడు ఎం.భరత్‌కు అవకాశం దక్కింది. ఏలూరు నుంచి యాదవ సామజికవర్గం నుంచి గోపాల్ యాదవ్, విజయవాడ నుంచి కేశినేని చిన్ని బరిలో నిలవబోతున్నారు. నరసరావుపేట నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉండి ఇటీవలే వైసీపీకి రాజీనాయ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు పేరు ఖరారైంది. అనంతపురం నుంచి టీడీపీ సీనియర్ నాయకుడు కాల్వ శ్రీనివాసులు, హిందూపురం నుంచి బీకే పార్థసారథి, తిరుపతి నుంచి అంగలకుర్తి నిహారిక లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండనున్నారు. అయితే, తుది జాబితా మరో ఈ నెల చివరి వారంలో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.






