BREAKING: విజయవాడ గురునానక్ నగర్‌లో సంచలనం.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

by Kema Shiva Kumar |   (  Updated:2024-04-30 07:24:00  IST  )

ఓకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన విజయవాడ పట్టణంలోని గురునానక్ నగర్‌లో చోటుచేసుకుంది.

BREAKING: విజయవాడ గురునానక్ నగర్‌లో సంచలనం.. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఓకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక ఘటన విజయవాడ పట్టణంలోని గురునానక్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురు‌నానక్ కాలనీకి చెందిన డాక్టర్ శ్రీనివాస్త తన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లితో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం కాసేపటికి క్రితం ఇంటి బయట డాక్టర్ శ్రీనివాస్ ఉరేసుకోగా.. ఇంటి లోపల భార్య, పిల్లలు, తల్లి విగత జీవులుగా పడి ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం చేసు నమోదు చేసుకుని వారిని ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. ఈ మేరకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story