Breaking: హిందూపురంలో చరిత్ర సృష్టించిన బాలకృష్ణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-06-04 09:54:14  IST  )

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ చరిత్ర సృష్టించారు....

Breaking: హిందూపురంలో చరిత్ర సృష్టించిన బాలకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్: హిందూపురంలో నందమూరి బాలకృష్ణ చరిత్ర సృష్టించారు. వరుసగా మూడో సారి ఆయన విజయం సాధించారు. గత రెండు ఎన్నికల్లో కంటే ఈ సారి భారీ మెజార్టీ సాధించారు. హిందూపురం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన తన సమీప అభ్యర్థి కోడూరి దీపికపై 31, 602 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల్లో జగన్ సునామీని సైతం తట్టుకొని దాదాపు 90, 704 ఓట్లు సాధించారు. 2014లో బాలకృష్ణకు 81,543 ఓట్లు వచ్చాయి. టీడీపీ స్థాపించిన నాటి నుంచి హిందూపురం నియోజకవర్గంలో ఆ పార్టీనే విజయం సాధిస్తూ వస్తోంది. ఎన్టీఆర్ సైతం మూడు సార్లు ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఆయన వారసుడు బాలకృష్ణ సైతం హ్యాట్రిక్ కొట్టారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ మరోసారి గెలిచింది. దీంతో హిందూపురం గడ్డపై టీడీపీ జెండా మళ్లీ రెపరెపలాడింది.

Next Story