- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: మదనపల్లె 'దస్త్రాల దహనం' కేసు 'సీఐడీ'కి అప్పగింత
by Geesa Chandu |
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దస్త్రాల దహనం కేసు విషయంలో.. డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు.

X
దిశ, వెబ్ డెస్క్: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దస్త్రాల దహనం కేసు విషయంలో.. డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమల రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ కేసు మొత్తాన్ని మదనపల్లె పోలీసులు రాబోయే రెండు రోజుల్లోగా.. సీఐడీకి అప్పగించ నున్నారు. అయితే గత నెల 21 వ తేదీన రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ కి సంబంధించిన దస్తావేజులు దహనమై ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.! ఈ ఘటనపై పోలీసులు మొత్తం 9 కేసులు నమోదు చేశారు. వారిలో పలువురు ఉద్యోగులు, నేతలు ఉన్నారు. తాజాగా ఈ కేసును డీజీపీ.. సీఐడీకి అప్పగించడంతో విచారణ మరింత లోతుగా జరగనుంది.
Next Story






