ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ.. ఏపీ హామీలపై చర్చ

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-02-09 08:19:28  IST  )

CM Jagan met PM Modi in Delhi

ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ.. ఏపీ హామీలపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీతో సీఎం జగన్ మోహన్ భేటీ అయ్యారు. ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో ప్రధాని మోడీని సీఎం జగన్ కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని మోడీ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య భేటీ కొనసాగుతుంది. ఈ భేటీ తర్వాత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌‌ను సీఎం జగన్ కలవనున్నారు. రాష్ట్రానికి విడుదల చేయాలని నిధులపై ఆమెతో చర్చించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్, రాష్ట్రంలో విడుదలైన పలు సర్వేల నేపథ్యంలో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అధిక రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకుంది.

Next Story