- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఎంపీ టికెట్‌పై క్లారిటీ ఇవ్వని బీజేపీ అధిష్టానం.. టీడీపీలో చేరనున్న రఘురామకృష్ణరాజు!
by Kema Shiva Kumar |
ఏపీల సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో టికెట్ల కేటాయింపులో ఆయా పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీల సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో టికెట్ల కేటాయింపులో ఆయా పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే నరసాపురం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారనే చర్చ జోరుగా కొనసాగుతోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఖాయమైంది. కాగా, బీజేపీలో చేరి నరసాపురం నుంచి పోటీ చేయాలనుకున్న రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ అధిష్టానం టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఆయన ఇప్పటికే చంద్రబాబుతో కలిసి నడస్తున్నాని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఆయనకు టీడీపీ విజయంనగరం ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక అదీ కుదరకపోతే ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా మరో వారం రోజుల్లో పోటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Next Story






