టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడును తొలగించాలి : రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు

by Naga Rani Yarlagadda |

టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసనలు చేశారు. సీఎం కూడా ఆయనకు సపోర్ట్ చేయడం దారుణమని విమర్శించారు.

టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడును తొలగించాలి : రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాలని, ఆయనతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు ఆలయాల్లో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో పల్నాజిల్లా వైకుంఠపురంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శంకరరావు వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. బీజేపీనేత సుధాకర్ ఆ ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు. దీంతో వైసీపీ, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ నాయుడు కామాంధుడని, అలాంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడటం సిగ్గు చేటని వైసీపీ నేతలు విమర్శించారు. ఇలాంటి తప్పులు ఎత్తిచూపుతున్నవారిపై దాడులు చేయడం దారుణమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. బీఆర్ నాయుడు చేసిన అపవిత్ర కార్యక్రమాలు బయటికి వచ్చినా ఇంకా ఆయన్ని టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం సిగ్గుచేటన్నారు. అలాంటి వ్యక్తిపై కనీస చర్యలు కూడా తీసుకోలేని అసమర్ధ సీఎం చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఇప్పటికైనా బీఆర్ నాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు పదవిని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలను కూడా సీఎం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

Next Story