BR Naidu: సాధారణ భక్తుడిలా వెళ్లా.. సిబ్బంది నిర్లక్ష్యం కళ్లారా చూశా

by Gantepaka Srikanth |

మంగళగిరి సమీపంలోని వెంకటపాలెం(Venkatapalem) శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) ఆకస్మికంగా తనిఖీ చేశారు.

BR Naidu: సాధారణ భక్తుడిలా వెళ్లా.. సిబ్బంది నిర్లక్ష్యం కళ్లారా చూశా
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళగిరి సమీపంలోని వెంకటపాలెం(Venkatapalem) శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయ పరిశుభ్రత చూసి అధికారులపై సీరియస్ అయ్యారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా కీలక ట్వీట్ పెట్టారు. ‘‘ఇవాళ ఆకస్మికంగా వెంకటపాలెం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తనిఖీ చేశాను. సాధారణ భక్తుడిలా దర్శనానికి వెళ్లి, ఆలయ నిర్వహణలో కొన్ని నిర్లక్ష్యాలు గమనించాను. దేవుడి అలంకరణ నుంచి - సిబ్బంది తీరు వరకు నిర్లక్ష్యం కనిపించడం బాధాకరం. ఇలాంటి వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. భక్త సేవలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇకపై దేశంలోని అన్ని శ్రీవారి ఆలయాలను ఆకస్మికంగా సందర్శిస్తూ, భక్తులకు అందించే సేవా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం’’ అని బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. ట్వీట్

Next Story