- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆంధ్రప్రదేశ్ లో బీపీసీఎల్ లక్ష కోట్ల పెట్టుబడులు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1 లక్ష కోట్ల (సుమారు 11 బిలియన్ డాటర్లు) భారీ పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది.

దిశ, వెబ్ డెస్క్ : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1 లక్ష కోట్ల (సుమారు 11 బిలియన్ డాటర్లు) భారీ పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు సమీపంలో దాదాపు 6,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా ప్రాజెక్టును నెలకొల్పనున్నారు. బీపీసీఎల్ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రిఫైనరీ సామర్థ్యం ఏటా 9-12 మిలియన్ మెట్రిక్ టన్నుల మధ్య ఉంటుంది. ఇది దేశంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ యూనిట్లలో ఒకటిగా నిలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, కీలక అనుమతులు ఇప్పటికే లభించాయి. వాణిజ్య కార్యకలాపాలు జనవరి 2029 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో భారీ పారిశ్రామిక అభివృద్ధి జరగడమే కాకుండా, పెట్రోకెమికల్ రంగంలో భారతదేశ స్వావలంబనకు (ఆత్మనిర్భర్ భారత్) కూడా ఇది ఎంతో బలాన్ని చేకూర్చనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అల్ట్రా-మెగా పెట్టుబడి (Investment) ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఇంధన రంగాల వృద్ధికి పెద్ద ముందడుగు కానుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా ఈ రిఫైనరీ చుట్టూ అనుబంధ పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం లభించనుంది. ఈ ప్రాజెక్టులో మైనారిటీ వాటాను తీసుకునే అవకాశంపై భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా (OIL)తో కూడా ఒక అవగాహన ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకుంది. ఇది వ్యూహాత్మక సహకారానికి దారితీస్తుంది. దేశ ఇంధన భద్రత, దక్షిణాది మార్కెట్ అవసరాలను తీర్చడంలో ఈ రామాయపట్నం కాంప్లెక్స్ కీలక పాత్ర పోషించనుంది.






