బెదిరింపులు, కేసులకు భయపడేది లేదు : బొత్స సత్యనారాయణ

by Naga Rani Yarlagadda |

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) డిమాండ్ చేశారు.

బెదిరింపులు, కేసులకు భయపడేది లేదు : బొత్స సత్యనారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) డిమాండ్ చేశారు. ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. సూపర్ సిక్స్ (Super Six) అని హామీలిచ్చి.. ఇప్పుడు వాటిని పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ధర్మం కాదన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు. ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం దాడులు చేయిస్తోందని, ఈ పద్ధతి సబబు కాదని సున్నితంగా హెచ్చరించారు.

Next Story