- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ ఎమ్మెల్యే కాదు మాజీ సీఎం..ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్
జగన్ ఎమ్మెల్యే కాదని మాజీ ముఖ్యమంత్రి అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ ఎమ్మెల్యే అని ఆయనకు ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామని హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: జగన్ ఎమ్మెల్యే కాదని మాజీ ముఖ్యమంత్రి అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ ఎమ్మెల్యే అని ఆయనకు ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామని హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.పనిమాలిన మాటలు మానుకోవాలని హితవుపలికారు. బాధ్యత లేని మాటలు, బాధ్యతా రాహిత్యమైన మాటలు అని మండిపడ్డారు. టీడీపీ నాయకులు ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారో ప్రజలు గమణిస్తున్నారని అన్నారు.
ప్రభుత్వానికి కొన్ని నిబంధనలు ఉంటాయని ఎవరైనా చట్ట ప్రకారం నడవాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యతను నిర్వహిస్తామని, అధికార పార్టీని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తామన్నారు. జగన్ పై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని అన్నారు. భద్రత కల్పించకపోగా తిరిగి తమ నాయకుడిపై కేసులు పెడుతోందని మండిపడ్డారు. జగన్ ప్రజాధరణ ఉన్న నాయకుడు అని ఆయనకు సెక్యురిటీ కల్పించాలని డిమాండ్ చేశారు.






