- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Borugadda Anil: పరారీలో బోరుగడ్డ అనిల్.. సంచలన సెల్ఫీ వీడియో విడుదల
రౌడీ షీటర్ (Rowdy Sheeter), వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరుడు (YSRCP Sympathizer) బోరుగడ్డ అనిల్ (Borugadda Anil) ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ షీటర్ (Rowdy Sheeter), వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరుడు (YSRCP Sympathizer) బోరుగడ్డ అనిల్ (Borugadda Anil) ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తన తల్లి ఆనారోగ్యంతో భాధపడుతోందంటూ ఇటీవలే హైకోర్టులో బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు, మధ్యంతర బెయిల్ పొడిగింపు కోసం ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లు కోర్టులో చూపాడు. దీంతో ధర్మాసనం అతడికి బెయిల్ మంజూరు చేయగా బోరుగడ్డ అనిల్ ఏకంగా రాష్ట్రం నుంచే పరార్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి పట్టుకునేందుకు పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అదేవిధంగా అతడి స్వస్ధలం గుంటూరుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనిల్ ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ అనిల్ (Borugadda Anil) సోషల్ మీడియా (Social Media) వేదికగా సంచలన వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో అతడు మాట్లాడుతూ.. తనకు బెయిల్ (Bail) రాకుండా సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan), మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు. ఎలాగైనా తనను చంపాలని ప్లాన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఏం జరిగినా కూటమి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని తెలిపాడు. చెన్నై నగరంలో తన తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ (Open Heart Surgery) జరగిందని.. కన్నతల్లికి ఇప్పుడు తన అవసరం ఉందని బోరుగడ్డ ఆ వీడియాలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.






