- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు, జగన్ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అలజడి వాతావరణం నెలకొంది...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అలజడి వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), మాజీ ముఖ్యమంత్రి జగన్(Former Cm Jagan) ఇళ్లతో పాటు తిరుపతి(Tirupati)లోని పలు ప్రాంతాల్లో కూడా బాంబు(Bomb)లు పెట్టామని బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. ‘హోలి ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్’ పేరిట భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు మెసేజ్ లో పేర్కొన్నారు. దీంతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఈ నెల 6న తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో బాంబ్ స్వ్కాడ్ సిబ్బంది , అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబు బెదిరింపులతో తిరుపతి, శ్రీకాశహస్తిలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తిరుపతి అగ్రికల్చర్ కాలేజీలోని సీఎం హెలిపాడ్ వద్ద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.






