- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మచిలీపట్నంలో జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
by Naga Rani Yarlagadda |
మచిలీపట్నంలో ఉన్న జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లు ఆగంతకులు జడ్జికి మెయిల్ పంపారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉన్న జిల్లా కోర్టుకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. జిల్లా జడ్జికి ఆగంతకులు కోర్టులో బాంబు పెట్టినట్లుగా మెయిల్ చేయగా.. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగిన పోలీసులు కోర్టు లోపల, బయట క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో కోర్టు ఆవరణలోకి పోలీసులు ఎవ్వరినీ అనుమతించడం లేదు. ఈ ఘటనతో చుట్టుపక్కల నివాసితులు భయాందోళనకు గురయ్యారు. కాగా.. గడిచిన నెలరోజుల కాలంలో రాష్ట్రంలోని అనంతపురం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో ఉన్న పలు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. పూర్తి తనిఖీల తర్వాత ఆ బెదిరింపులు ఆకతాయిల పనిగా తేల్చారు.
Next Story






