ఉపాధి హామీ పనుల్లో బాంబు పేలుడు.. ముగ్గురు కూలీలకు గాయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-20 08:55:22  IST  )

విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ పనుల వద్ద ఒక్కసారిగా పేలుడు సంభవించడం తీవ్ర కలకలం రేపింది...

ఉపాధి హామీ పనుల్లో బాంబు పేలుడు.. ముగ్గురు కూలీలకు గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా(Vizianagaram District)లో ఉపాధి హామీ పనుల(Upadi Hami Works) వద్ద ఒక్కసారిగా పేలుడు సంభవించడం తీవ్ర కలకలం రేపింది. కాటకాపల్లి గ్రామ శివారులోని చెరువులో కూలీలు మట్టి పెకిలిస్తుండగా భూమిలో ఉన్న నాటుబాంబు(Natu Bomb) ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాంబులోని గాజు పెంకులు ఒంటికి గుచ్చుకోవడంతో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో తోటి కూలీలు భయాందోళనతో పరుగులు తీశారు.

అడవి పందుల వేట కోసం..

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం పెందుర్తిలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. పేలుడు తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్ద ప్రాణనష్టం తప్పిందని అధికారులు అంటున్నారు. అడవి పందుల వేట కోసం ఎవరో అమర్చిన నాటుబాంబు మట్టిలో ఉండిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story