- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీలో పెనమలూరు పంచాయితీ.. వెనక్కి తగ్గనంటున్న బోడే ప్రసాద్
పెనమలూరు పంచాయితీ టీడీపీలో వర్గ విభేదాలకు దారి తీస్తోంది..

దిశ, వెబ్ డెస్క్: పెనమలూరు పంచాయితీ టీడీపీలో వర్గ విభేదాలకు దారి తీస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఇంచార్జిగా బోడే ప్రసాద్ ఉన్నారు. పార్టీ కష్టకాలంలో కూడా సేవలు కొనసాగించారు. అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి పార్థసారధి టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తన సీటుకు ఎసరుపెడతారేమోనని బోడె ప్రసాద్ ఆందోళన చెందుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెనమలూరు నుంచి తానే పోటీ దిగుతానని చెబుతున్నారు. నియోజకవర్గం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. పెనమలూరు సీటు, గెలుపు రెండూ తమదేనని తేల్చి చెప్పారు. అటు నియోజకవర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా బోడే ప్రసాద్‌కే జై కొడుతున్నారు. పార్థసారధి రాకను వ్యతిరేకిస్తున్నారు. దీంతో పెనమలూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.






