- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొబ్బిలి వీణకు అరుదైన గుర్తింపు
చారిత్రకమైన బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం లభించింది.

దిశ, వెబ్ డెస్క్: చారిత్రకమైన బొబ్బిలి వీణకు మరో అరుదైన గౌరవం లభించింది. సంగీత వాయిద్యాల యవనికలో ప్రత్యేక స్థానం కలిగిన ఈ వీణలు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్" (ODOP) పథకంకు ఎంపికైంది. జూలై 15న ఢిల్లీలోని భారత్ మండపం, ప్రగతి మైదానంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును జిల్లా కలెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ అందుకోనున్నారు. జిల్లాలోని బొబ్బిలి పట్టణానికి సమీపంలోని గొల్లపల్లి గ్రామంలో ఈ వీణలను తయారు చేస్తుంటారు. బొబ్బిల రాజుల కాలం నుంచి ఈ గ్రామంలోని అనేక కుటుంబాలు వీణ తయారీలో నిమగ్నమై జీవనం సాగిస్తున్నాయి.
ఇక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ వీణలను పనస, సంపంగి చెక్కలతో తయారుచేస్తారు. ప్రతిష్టాత్మకమైన జీ20 సభ్య దేశాల సమావేశాల్లో సైతం బొబ్బిలి వీణ తన వైభవాన్ని చాటింది. జీఐ గుర్తింపు పొందిన బొబ్బిలి వీణలకున్న పేరు మరే వీణలకు లేదనే చెప్పాలి. తాజాగా ఓడిఓపి క్రింద బొబ్బిలి వీణకు గుర్తింపు లభించడంతో, వీటి ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందనడంలో సందేహం లేదు.






