- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Boat Race: చేపల వేట కోసం.. గోదావరిలో పడవ పోటీలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బలుసుతిప్పలో గోదావరి నదీపాయల్లో చేపల వేట హక్కుల కోసం స్థానిక మత్స్యకారులు మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించిన పడవల పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బలుసుతిప్పలో గోదావరి నదీపాయల్లో చేపల వేట హక్కుల కోసం స్థానిక మత్స్యకారులు గురువారం ప్రత్యేకంగా నిర్వహించిన పడవల పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. సుమారు 100కి పైగా పడవలు ఈ పోటీల్లో పాల్గొనగా, ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. చేపల వేట స్థావరాల కేటాయింపులో సంప్రదాయంగా పాటించే విధానంలో భాగంగా ఈ పోటీలు జరుగుతాయి.
నిర్దేశిత ప్రాంతానికి ముందుగా చేరుకున్న పడవ యజమానికి ఆ ప్రాంతంలో ఏడాది పాటు చేపలు వేటాడుకునే ప్రత్యేక హక్కు లభిస్తుంది. ఈ హక్కు పొందిన తర్వాత ఇతర పడవలకు ఆ ప్రాంతంలో వేటాడేందుకు అనుమతి ఉండదు. పోటీల భద్రత, పారదర్శకత కోసం పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు పర్యవేక్షణ నిర్వహించారు. స్థానికంగా ప్రాధాన్యం కలిగిన ఈ వార్షిక పోటీలు మత్స్యకారులలో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ పోటీలను చూడటానికి ప్రజలు గోదావరి తీరం వెంట నిలబడి తిలకించారు.






