గుండ్లకమ్మలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు

by Vemula.Srinu Prasad |

మొంథా తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. ..

గుండ్లకమ్మలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: మొంథా తుపాను(Montha Cyclone) ప్రభావంతో ప్రకాశం జిల్లా(Prakasam District)లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురిని పునరావాసాలకు తరలించేందుకు ప్రాణ నష్టం జరగలేదు. అయితే జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. అద్దంకి వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం పెరిగింది. ఈ వరదలో ముగ్గురు ఉద్యోగులు చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు మరో ముగ్గురు పడవలో వెళ్లారు. అయితే తిరిగి వస్తున్న సమయంలో బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు గుండ్లకమ్మలో గల్లంతయ్యారు. మరో బోటు సాయంతో ఫైర్ సిబ్బంది గుండ్లకమ్మ(Gundlakamma)లోకి వెళ్లారు. ఉద్యోగులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Next Story