టీటీడీపై దుష్ప్రచారం.. వైసీపీ హస్తంపై అనుమానాలు..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-01 15:17:39  IST  )

టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక వైసీపీ హస్తం ఉందని బోర్డులు సభ్యులు శాంతారాం, నరేశ్ అనుమానం వ్యక్తం చేశారు..

టీటీడీపై దుష్ప్రచారం.. వైసీపీ హస్తంపై అనుమానాలు..?
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో దేవుళ్లను సైతం వదిలిపెట్టడంలేదు. యదేచ్ఛగా విమర్శలు చేస్తున్నారు. తిరుమల వెంకన్ననైతే అవసరమొచ్చినప్పుడల్లా రాజకీయాల్లోకి లాగుతున్నారు. దేవుడి అని కూడా చూడకుండా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక తిరుమల వెంకన్న స్వామినైతే ఎప్పుడుపడితే అప్పుడు రాజకీయాల్లోకి లాగేస్తున్నారు. దుష్ప్రచారం చేస్తున్నారు. తిరుమలకు రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని వెళ్తుంటారు.

అయితే భక్తుల ముసుగులో కొందరు రాజకీయ నేతలు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన తొక్కిసలాటతో పాటు క్యూలైన్లలో భక్తులు పడుతున్న కష్టాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వం, టీటీడీపై విమర్శలు కురిపిస్తున్నారు. ఆ మధ్య జరిగిన గోవుల మృతిపైనా పెద్ద రచ్చే జరిగింది. టీటీడీ, ప్రభుత్వంపై రీసెంట్‌గా క్యూలైన్‌లో భక్తుడి మాదిరిగా ఓ వైసీపీ నాయకుడు చేసిన విమర్శలు రాజకీయ దుమారాన్ని రేపాయి. దీంతో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారం, నరేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పథకం ప్రకారమే క్యూలైన్లలో నినాదాలు చేశారని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని వైసీపీ చూస్తోందన్నారు. తొక్కిసలాట ఘటనలోనూ వైసీపీ హస్తంపై అనుమానాలున్నాయని చెప్పారు. గోవుల మరణంపైనా అసత్య ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. టీటీడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని శాంతారాం, నరేశ్ హెచ్చరించారు.

Next Story