- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
29 గంటలు.. ఇరుసుమండలో ఇంకా ఆగని మంటలు
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో సోమవారం మధ్యాహ్నం ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కారణంగా చెలరేగిన మంటలు 29 గంటలుగా ఎగసి పడుతూనే ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్ : బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో సోమవారం మధ్యాహ్నం ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కారణంగా చెలరేగిన మంటలు 29 గంటలుగా ఎగసి పడుతూనే ఉన్నాయి. బ్లో అవుట్ వద్ద మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదని అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్ తెలిపారు. ఓఎన్జీసీ టెక్నికల్ సిబ్బంది ఆధ్వర్యంలో మంటలను అదుపుచేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో 500 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని, బాధితులకు అన్ని సౌకర్యాలను అందిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. లక్కవరం గ్రామ ప్రజలను కూడా పునరావాస కేంద్రానికి తరలించారు.
6 ఫైరింజన్లు, 2 భారీ వాటర్ క్యానన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అడ్వాన్స్డ్ వాటర్ టెండర్లతో నీటిని స్ర్పింక్లింగ్ చేస్తున్నారు. నిన్నటితో పోలిస్తే మంటల తీవ్రత తగ్గినప్పటికీ.. ఇంకా ప్రమాదకర స్థాయిలోనే మంటలు ఎగసి పడుతున్నాయి. నిరంతరాయంగా వాటర్ స్ర్పే జరుగుతూనే ఉంది. ఈ మంటలు ఎప్పటికి అదుపులోకి వస్తాయో అధికారులు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.






