- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి: ఎమ్మెల్యే శిల్పా రవి
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను ఎమ్మెల్యే శిల్పా రవి కోరారు.

దిశ,డైనమిక్ బ్యూరో: వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను ఎమ్మెల్యే శిల్పా రవి కోరారు.నంద్యాల నియోజకవర్గంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలోపాల్గొన్న ఎమ్మెల్యే శిల్ప రవి వైసీపీకి ఓటెయ్యాలని కోరారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను పారదర్శకంగా సంతృప్తి స్థాయిలో తమ గడప వద్దకే చేరవేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజానీకం నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. పింఛన్ల నుంచి ఫీజుల దాకా.. ఇళ్ల పట్టాల నుంచి అమ్మ ఒడి వరకు నాలుగు నర సంవత్సరాల లోనే 99% హామీలను నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ప్రజలకు సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించడం జరుగుతుందని అదేవిధంగా సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తుండటంతో మంచి స్పందన లభిస్తోంది తెలిపారు. రెవిన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు మరియు సచివాలయాల సిబ్బంది వలంటీర్లు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రావడంతో వారి కష్టాలు కష్టాలు తీరిన ఆనందం ప్రజల్లో కనిపిస్తోందని ఎమ్మెల్యే శిల్ప రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి, వైసీపీ నాయకులు రామ సుబ్బారెడ్డి, మనీ మోహన్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, శ్రీనివాసులు సచివాలయ సిబ్బంది వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.






