- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతమ్మ తిరునాళ్లలో బ్లేడ్‌బ్యాచ్ హల్‌చల్
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ఉత్సవంలో బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్లలో బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ చేసింది. తిరునాళ్ల మహోత్సవంలో.. ఓ వ్యక్తి నిద్రిస్తుండగా గొంతు, ముఖంపై దాడి చేశారు. అతనికి గాయాలు కావడంతో తిరునాళ్లలో గస్తీ కాస్తున్న పోలీసులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. బ్లేడ్ బ్యాచ్ హల్ చల్ నేపథ్యంలో భక్తులు భయాందోళనకు గురయ్యారు.
కాగా.. తిరునాళ్ల ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దివ్యప్రభ మహోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింద. ఆలయ వేద పండితులు, అర్చకులు పురోహితుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజపూలమాలలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించిన 90 అడుగుల ప్రభపైకి ఉత్సవమూర్తుల్ని ఉంచి మేళతాళాలతో, సన్నాయి డప్పులు తీన్ మార్, కోలాటం నృత్య ప్రదర్శనలతో భారీ ఊరేగింపులతో ఉత్సవం ఘనంగా జరిగింది.






