- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala News : తిరుమలలో బ్లాక్ టికెట్ల కలకలం
తిరుమల(Tirumala)లో మరోసారి బ్లాక్ టికెట్ల(Black Tickets) కలకలం రేగింది.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala)లో మరోసారి బ్లాక్ టికెట్ల(Black Tickets) కలకలం రేగింది. తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనానికి సంబంధించిన టికెట్లను ఓ ముఠా బ్లాక్ లో విక్రయిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కోనసీమ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఇజ్రాయెల్(YCP MLC Israel) సిఫారసు లేఖపై దామోదర్ అనే వ్యక్తి ఈ టికెట్లు అమ్మినట్టు అధికారులు తెలియజేశారు. ఆరు టికెట్ల కోసం బాధితుల నుంచి రూ.30 వేలు నిందితుడు డిమాండ్ చేయగా.. హైదరాబాద్ కు చెందిన సాయికమల్ అనే బాధితుడు ముఠాకు రూ. 23 వేలు ఫోన్ పే చేశాడు. కాగా ఈ విషయంపై తిరుమల విజిలెన్స్ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేయగా.. అధికారులు రంగంలోకి దిగారు. శ్రీవారి బ్రేక్ దర్శన టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు దామోదర్ పరారీలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో విచారణ కొనసాగుతోంది . నిందితులను కోర్ట్ విచారణ నిమిత్తం సిట్ కు అప్పగించింది.






