- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో క్షుద్రపూజల కలకలం.. వింత ఆకారంలో ముగ్గులు వేసి!
ఏపీలో క్షుద్రపూజల కలకలం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా కడప మండలం రామరాజుపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. వింత ఆకారంలో ముగ్గులు వేసి అందులో నిమ్మకాయలు, పసుపు కుంకుమ పెట్టారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో క్షుద్రపూజల కలకలం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ జిల్లా కడప మండలం రామరాజుపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. వింత ఆకారంలో ముగ్గులు వేసి అందులో నిమ్మకాయలు, పసుపు కుంకుమ పెట్టారు. రెండు చోట్ల క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో పూజలు చేయడంతో ప్రజలు భయపడిపోతున్నారు.
గత రెండు నెలలుగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇలాంటివి పునరావృతం అవ్వకుండా చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేసుకుని నింధితులను పట్టుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఏపీలో అఘోరా క్షుద్రపూజలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. భారీ ముగ్గులు వేసి హోమాలు చేసిన ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరోసారి కడప జిల్లాలో అలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో భయాందోళనకర వాతావరణం నెలకొంది.






