- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో బిజెవైఎం 5కె మారథాన్
స్వామి వివేకానంద స్ఫూర్తితో యూత్ మారథాన్.

దిశ, వెబ్ డెస్క్ : రేపు జరగనున్న వివేకానంద జయంతిని (Vivekananda Jayanti) పురస్కరించుకొని ఏపీ బిజెవైఎం (BJYM Andhra Pradesh) ఆధ్వర్యంలో 5కె మారథాన్ (Youth Marathon) నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా విజయవాడలోనూ మారథాన్ ను ఆదివారం జరిపారు. ఎంజీ రోడ్డులోని రాఘవయ్య పార్కు వద్దనున్న స్వామి వివేకానంద పార్కు నుంచి మారథాన్ ప్రారంభమయ్యింది. కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ యూత్ మారథాన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఆయనతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సలహాదారులు, మాజీ ఐపీఎల్ ఆటగాడు, కెకె క్రికెట్ అకాడమీ వ్యవస్థాపకుడు కల్యాణ్ కృష్ణ దొడ్డపనేని, గౌరవ ఆహ్వానితులుగా బిజెవైఎం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ హాజరయ్యారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన రన్ లో ఔత్సాహికులతో కలిసి పరుగులు తీశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత నిర్భయంగా ఉండాలన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు అహర్నిశలు శ్రమించాలన్నారు. భారత భవిష్యత్తు నిర్మాణం కోసం పరుగులు తీయాలని పిలుపునిచ్చారు. వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణం అని అభిప్రాయపడ్డారు. దేశ ఖ్యాతిని, భారతీయ సంస్కృతి ఘనతను ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. భారత్ మాతాకీ జై అని పెద్ద ఎత్తున నినదించారు. ఈ మారథాన్ లో వందలాది మంది యువతీ యువకులు, ఔత్సాహికులు, క్రీడాకారులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు.
దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు : మంత్రి
యువశక్తే నవభారత నిర్మాణానికి పునాది. “నాకు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న వందమంది యువకులను ఇవ్వండి, ఈ దేశ గతిని మార్చేస్తాను” అని స్వామి వివేకానంద నాడు ఇచ్చిన పిలుపు నేటికీ మార్గదర్శకం అని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆ యువశక్తినే నమ్ముకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నారన్నారు. యువతలోని నైపుణ్యాన్ని గుర్తించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి వినూత్న పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. వాటి ఫలితంగా నేడు దేశవ్యాప్తంగా సుమారు లక్షన్నర స్టార్టప్‌లు ఏర్పడి, వాటిలో 25 నుంచి 30 యూనికార్న్ కంపెనీలు నిలిచాయంటే, అది భారత యువత ప్రతిభకు నిదర్శనం అన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించి, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా, విశ్వగురువుగా నిలబెట్టాలన్నదే మోదీ గారి సంకల్పం. స్వామి వివేకానంద ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో యువత ముందుండాలని పిలుపునిచ్చారు.






