- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ ఇంకా పాఠం నేర్చుకోలేదు: పురంధేశ్వరి
పాకిస్తాన్ ఇంకా పాఠం నేర్చుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్(Union Minister Ravi Shankar Prasad) నేతృత్వంలో ఆల్ పార్టీ పార్లమెంటరీ ప్రతినిధి బృందం డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో పర్యటించింది. ఈ బృందంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి(BJP state president Purandeshwari) సైతం ఉన్నారు. ఈ సందర్భంగా భారతీయ ప్రవాసులను ఆమె మాట్లాడారు. పఠాన్‌కోట్, ఉరి దాడుల తర్వాత "ఇక చాలు" అనే దృఢమైన నిర్ణయం తీసుకున్నా.. వెంటనే సర్జికల్ దాడులు జరిగాయి. కానీ పాకిస్తాన్ పాఠం నేర్చుకోలేదు. పహల్గామ్‌లో 26 మంది పౌరులను చంపింది. దీంతో భారతదేశం ఉగ్రవాదులకు బలమైన సమాధానం ఇవ్వాలని నిర్ణయించాం. దేశంపై చాలా బాధ్యతలు ఉన్నాయి. పౌరులు మేల్కొని తమ పనిలో ఉన్నప్పుడు ఎక్కడా దాడి జరగలేదు. మే 7న తెల్లవారుజామున దాదాపు 20-25 నిమిషాల పాటు ఈ దాడి జరిగింది. తాము ఒక్క పౌరుడికి కూడా ప్రాణనష్టం కలిగించలేదు’’ అని పురంధేశ్వరి పేర్కొన్నారు.






