వైఎస్ షర్మిలపై బీజేపీ చీఫ్ ఫైర్

by Malleboina Mahesh |

దళితవాడల్లో 5000 గుడులను TTD తరపున కట్టిస్తామని తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

వైఎస్ షర్మిలపై బీజేపీ చీఫ్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: దళితవాడల్లో 5000 గుడులను TTD తరపున కట్టిస్తామని తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రకటించారు. ఈ ప్రకటనపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా (YS Sharmila) స్పందిస్తూ.. టీటీడీ నిర్ణయాన్ని (TTD decision) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బీజేపీ పార్టీపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళితవాడల్లో 5వేల గుడులు కావాలని ఎవరు అడిగారని, ఇప్పుడు గుడులు కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని TTD దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే దళితవాడలను అభివృద్ధి చేయొచ్చు కదా ? రాజ్యాంగానికి వ్యతిరేకంగా RSS సిద్ధాంతాన్ని నెత్తిన ఎత్తుకొని రాష్ట్రవ్యాప్తంగా గుడులు కట్టడం సరికాదని చెప్పుకొచ్చారు.

టీటీడీ నిర్ణయం, బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ (AP BJP President Madhav) ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఆర్ఎస్ఎస్ (RSS) అర్థం తెలియదని ఎద్దేవ చేశారు. అలాగే టీటీడీ నిర్ణయాన్ని తప్పు పడుతూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా షర్మిలా మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. భర్తతో కలిసి షర్మిల స్వయంగా మత మార్పిడులు చేశారని ఆలయాలు వద్దు మరుగుదొడ్లు కట్టండి అని చెబుతారా..? ముస్లింలు, క్రైస్తవులకు కూడా ఇలాగే చెప్పే సాహసం చేయగలరా అంటూ వైఎస్ షర్మిలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ప్రశ్నించారు.

Next Story