రుషికొండ భవనాలపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

రుషికొండ భవనాలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు..

రుషికొండ భవనాలపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రుషికొండ భవనాల(Rushikonda Buildings)పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు(BJP MLA Vishnu Kumar Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ భవనాల వినియోగంలో స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. రుషికొండ భవనాలను ఆతిథ్య రంగానికి కేటాయించాలని మంత్రుల కమిటీ తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. రుషికొండను ఆదాయ వనరుల కిందే చూడకూడదన్నారు. స్టార్‌ హోటల్స్‌కు ఇచ్చి సామాన్యులకు దూరం చేయొద్దని సూచించారు. విశాఖ(Visakha) అంటే సాప్ట్‌వేర్ పెట్టుబడులే కాదని, ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలన్నారు. రుషికొండ భవనాలపై మరోసారి ఆలోచించాలని, స్థానిక MLA, MP అభిప్రాయం తీసుకోవాలని మంత్రుల కమిటీకి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Next Story