లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని విషయాలు బయటికి వస్తాయి: విష్ణు కుమార్ రాజు

by Ajay Maddhiboyina |

లిక్కర్ స్కామ్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది శాంపిల్ మాత్రమే అని ఇంకా చాలా ఉందని వ్యాఖ్యానించారు.

లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని విషయాలు బయటికి వస్తాయి: విష్ణు కుమార్ రాజు
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ స్కామ్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది శాంపిల్ మాత్రమే అని ఇంకా చాలా ఉందని వ్యాఖ్యానించారు. సుమారు రూ.3,200కోట్ల స్కామ్ జరిగిందని అంటున్నారని కానీ ఇంకా పెద్ద ఎత్తున ఉందని చెప్పారు. తవ్వే కొద్ది మరిన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. అంతే కాకుండా అన్ని దారులు కూడా తాడేపల్లి వైపే చూపిస్తున్నాయని అన్నారు.

తాడేపల్లి ప్యాలెస్ గేటు వరకు వెళ్లి అక్కడ ఆగిపోతున్నాయని చెప్పారు. లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వ్యాపారవేత్తల దగ్గర డబ్బులు తీసుకుని ప్రజల డబ్బులు తిన్నారని అన్నారు. 2019లో నేనున్నా అంటూ ప్రజల తలపై చేతులు పెడుతూ ఎంతో ఆప్యాయత చూపించి దొంగప్రేమ నటించారని అన్నారు. ఇప్పుడు వాళ్లు ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చిందని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story