జగన్‌కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది.. బీజేపీ ఎమ్మెల్యే సెటైర్లు

by srinivas |
జగన్‌కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది.. బీజేపీ ఎమ్మెల్యే సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిపై బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ సెటైర్లు వేశారు. ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందని ఎద్దేవా చేశారు. విశాఖలో పర్యటించిన ఆయన ఎన్నికల్లో కూటమి ఘన విజయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ లేని విధంగా ప్రజలు తీర్పునిచ్చారన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని విమర్శించారు. గత ఐదేళ్లలో ప్రజలు ఎంత విసిగి పోయారో ఎన్నికల ఫలితాలు చూస్తే అర్ధమవుతోందని చెప్పారు. అన్ని వ్యవస్థలను జగన్ సర్వనాశనం చేశారని ఆరోపించారు. అన్ని శాఖల్లోనూ అప్పులే ఉన్నాయని, జగన్ పాలనతో రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మిగిలిందని విమర్శించారు. జగన్ మళ్లీ గెలిస్తే రిషికొండ భవనంపై కూర్చోవాలనుకున్నారని, ప్రజలు ఇచ్చిన తీర్పుతో బొమ్మ కనిపించిందని ఎద్దేవా చేశారు. అనినీతికి పాల్పడిన వైసీపీ నాయకులను వదిలేదని సత్యకుమార్ హెచ్చరించారు.

Next Story

Most Viewed