- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య వర్సెస్ చిరంజీవి, జగన్: తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్న కామినేని
అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వెనక్కి తీసుకున్నారు..

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ(Assembly)లో చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్(Bjp Mla Kamineni Srinivasarao) వెనక్కి తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల విషయంలో తలెత్తిన వివాదంపై మాట్లాడేందుకు వెళ్లిన చిరంజీవి(Chiranjeevi) బృందాన్ని అప్పటి సీఎం జగన్ అవమానించారనే అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో ఆయన గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో అపార్ధాలు చెలరేగాయి. బాలకృష్ణ(Balakrishna), చిరంజీవి ఫాన్స్‌తో పాటు టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటలయుద్ధం నడిచింది. బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి ఫ్యాన్స్, వైసీపీ నేతలు తప్పుబట్టారు. అయితే టీడీపీ(Tdp) శ్రేణులతో పాటు, నందమూరి అభిమానులు బాలయ్య కామెంట్స్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలు రాజకీయ, సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అయితే అసెంబ్లీ సమావేశాల్లో తాను చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు స్పందించారు. మొన్నటి సభలో తాను చేసిన విషయాలు అపార్థాలకు దారితీశాయనే అభిప్రాయం కలిగిందని కామినేని ఒప్పుకున్నారు. సంబంధిత విషయాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఆయన కోరారు. దీంతో స్పీకర్ అయ్యన్నతో చెప్పి రికార్డుల నుంచి తొలగిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణంరాజు తెలిపారు.






