పార్టీ మారే వైసీపీ నేతలకు బీజేపీ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్

by srinivas |
పార్టీ మారే వైసీపీ నేతలకు బీజేపీ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ వైసీపీ నేతలకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు(BJP MLA Vishnukumar Raju) బంపర్ ఆఫర్ ఇచ్చారు. విశాఖ బీజేపీ కార్యాలయం(Visakha BJP office)లో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో వైసీపీ(Ycp) పని అయిపోయిందన్నారు. వైసీపీ నుంచి ఆ పార్టీ నేతలు బయటకు వస్తే వాళ్లకు తాము అండగా ఉంటామని విష్ణు కుమార్ రాజు హామీ ఇచ్చారు


మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) మానసిక పరిస్థితి బాగోలేదని, అందుకే 2.0 అంటూ ఉహల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(AICC leader Rahul Gandhi), రాష్ట్రంలో వైసీపీకి జగన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం బీజేపీ కూటమిని ఎలాంటి ఢోకాలేదన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే విజయమన్నారు. జగన్ 2.0 మాటలు సినిమాల్లో సరిపోతాయని, నిజ జీవితంలో జరగవని ఎద్దేవా చేశారు. అసభ్యంగా మాట్లాడే, వ్యవహరించే మంత్రులను కూటమి పార్టీల్లోకి ఎప్పుడూ తీసుకోమని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed