- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan Mohan Reddy : త్వరలో జైలుకు జగన్..బీజేపీ ఎమ్మెల్యే జోస్యం వైరల్
త్వరలో జగన్ జైలుకు వెళ్లబోతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత జగన్(Ycp Chief Jagan) త్వరలో జైలుకు వెళ్లబోతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(Bjp Mla Adinaryana Reddy) చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత ప్రభుత్వం హయాంలో లిక్కర్ అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అలాగే కస్టడీలోకి తీసుకుని మరింతగా విచారణ జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాం(Liquor Scam)కు సంబంధించి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో జగన్ జైలుకెళ్లడం, చిప్పకూడు తినకతప్పదని హెచ్చరించారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సైతం జైలుకు వెళతారని ఆయన జోస్యం చెప్పారు. జైలుకెళ్లడం తప్పదని అటు జగన్‌కు కూడా తెలుసని, అందుకే ప్రతిరోజూ మీడియా ఎదుట మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కాం జరిగిందంటూ సీఎం చంద్రబాబు(Cm Chandrababu) బేతాళ కథలు కదలు చెబుతున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆదినారాయణరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన అప్పులతో రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. అయినా బీజేపీ సహకరిస్తుండటంతో కూటమి ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.






