రాజకీయాలు మానేస్తా: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

by Vemula.Srinu Prasad |

అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీతో వివాదంపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పందించారు....

రాజకీయాలు మానేస్తా: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కడప జిల్లా(YSR Kadapa District) చిలంకూరు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ(Ultratech Cement Factory) కార్యకాలపాలు నిలిచిపోయాయి. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి(Jammalamadugu BJP MLA Adi Narayana Reddy) అడ్డుకుంటున్నారని, సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో చెప్పి దాడలు చేయిస్తానంటూ బెదిరిస్తున్నారిస్తున్నారని కలెక్టర్‌కు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. తమకు కాంట్రాక్టులు ఇచ్చే వరకూ ఉత్పత్తి చేయొద్దంటూ బెదిరించారని పేర్కొంది. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఫ్యాక్టరీలో తిరిగి ఉత్పత్తిని ప్రారంభించారు. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది

ఈ మేరకు సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంపై ఎమ్మెల్యే ఆదినారాయణ తాజాగా స్పందించారు. వైసీపీ నాయకులతో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం కుమ్మక్కయిందన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంలో తన తప్పుంటే రాజకీయాలు మానేస్తానని చెప్పారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.

Next Story